nostalgic with Ananda Shankar...




నాన్నకు వాద్య సంగీతం అంటే మహా ఇష్టం. మా చిన్నప్పుడూ నాన్న ఇంట్లో ఉంటే ఏదో ఒక వాద్య సంగీతం వినబడుతూ ఉండేది. సంతూర్, సితార్, వీణ, ఫ్లూట్ మొదలైనవి కాకుండా Accordion, Electric guitar, Acoustic guitar, Piano, Saxophone, Trumpet మొదలైన పాశ్చాత్య వాయిద్యాల తాలుకు కేసెట్లు కూడా కొనేవారు. అలా మాకు నాన్నవల్ల రకరకాల సంగీత వాయిద్యాలు, పాశ్చాత్య సంగీతం పట్ల కూడా ఆసక్తి పెరిగింది.

మేం చిన్నప్పుడు బాగా విన్న కేసేట్లలో ఆనందా శంకర్ వి కొన్ని. బెంగాలీ సంగీతకారుడైన ఆనందా శంకర్(1942 - 1999) ప్రఖ్యాత సితార్ వాద్యకారుడైన పండిట్ రవిశంకర్ బంధువు. భారతీయ, పాశ్చాత్య సంగీత వాయిద్యాల కలయికలతో చేసిన "Fusion music" ఆనందా శంకర్ ప్రత్యేకత. Ananda Shankar And His Music, melodies from india, Enchanting India, Shubh- The Auspicious, I REMEMBER, Temptations మొదలైన ఆల్బంస్ జనాదరణ పొందాయి.


ఆనందా శంకర్ ట్యూన్స్ విన్నప్పుడలా నాకు చిన్నప్పుడు ఇంట్లో నాన్న ఆఫీసుకి తయారవుతూనో, ఏవో పనులు చేసుకుంటూనో వింటున్న రోజులు గుర్తుకు వస్తాయి. అంతేకాక, 1970s & '80s రోజుల్లో నాన్న రేడియోలో ప్రొడ్యూస్ చేసిన సంగీత ధారావహిక కార్యక్రమం " సంగీతప్రియ"లో ఓపెనింగ్ ట్యూన్ ఆనందా శంకర్ దే. "సంగీతప్రియ శ్రోతలకు మీ రామం నమస్కారం.." అనగానే "akbar's jewels" అనే ట్యూన్ వచ్చేసేది... దీనిలో 0.24 to 0.55 వరకు సంగీతప్రియ టైటిల్ మ్యూజిక్ !



మరికొన్ని ఆనందా శంకర్ ట్యూన్స్ :


The River:




"Dancing peacocks"



light my fire




namaskar:





ఆనందా శంకర్ ను గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ:

3 Responses
  1. SHANKAR.S Says:

    ఫస్ట్ టైం వింటున్నా ఆనంద్ శంకర్ గురించి. కానీ తన సంగీతం మాత్రం చాలా సార్లు ఎక్కడో విన్నట్టుంది. ముఖ్యంగా "Dancing Peacocks". ఎందుకో గానీ దూరదర్శన్ టైం మ్యూజిక్ చాలావరకు ఈయన చేసినవేనా అనిపించింది. మంచి సంగీతకారుడిని పరిచయం చేసినందుకు థాంకులు తృష్ణ గారూ.


  2. @shankar.S: పూర్వం AIR, DD వాళ్ల దగ్గర రకరకాల సంగీతవాయిద్యాల LP Records అవీ ఉండేవండి. కార్యక్రమాల మధ్యన వచ్చే విరామంలో వీటిని వాడుకునేవారు. అలాగ ఈ ఆనంద్ శంకర్ వీ, మిగిలినవారివీ చాలా సార్లు రేడియోలోనూ, టివీ లోనూ కూడా వచ్చేవి. అలా చిన్నప్పుడు బాగా వినటం వల్ల మీకు ఇవి తెలిసినట్లు ఉండి ఉండచ్చు.
    Thanks for the visit.


  3. Indira Says:

    డియర్ తృష్ణా,ఎన్నాళ్ళయ్యింది మళ్ళీ ఈ ట్యూన్ విని!!ఆనందా శంకర్ పేరు నేను వినలేదు.అన్నీ ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తున్నాయి.ఒకసారి మిమ్మల్ని అదిగినట్టు గుర్తు సంగీత ప్రియ టైటిల్ మ్యూజిక్ గురించి.కానీ అది రాగ రాగిణి అనే లలితసంగీతం కార్యక్రమం టైటిల్ సంగీతం అని గుర్తుకొచ్చింది.అదికూడా చాలా బావుంటుంది.