Tagore గొంతులో ఆయన కవితలు, పాట...
విశ్వకవి రవీంద్రుని(1861–1941) గురించి ప్రత్యేకించిన పరిచయం అవసరం లేనేలేదు. దాదాపు అన్నిసాహితీ విభాగాల్లోనూ అందవేసిన చెయ్యి ఆయనది. ఒక సంపూర్ణ కళాకారుడాయన. కవిగా, కథకునిగా, వ్యాస రచయితగా, నవలా రచయితగా, నాటక రచయితగా, సంగీతకారునిగా, గాయకునిగా, చిత్రకారునిగా ఎన్నో అవతారాలెత్తారు. కానీ అన్నింటిలోకీ ముఖ్యంగా ఆయన ఒక కవిగానే మనకు ఎక్కువ కనిపిస్తారు. ఏభైకు పైగా ఉన్న గేయ సంపుటిలు, అందులోని రెండువేలకు పైచిలుకు గేయాలు, 1913లో ఆయన సాహిత్యానికి అందిన "నోబుల్ పురస్కారం" అందుకు నిదర్శనం.ఇక లిటిరేచర్ స్టూడెంట్ గా డిగ్రీలోనూ, పిజీలోనూ కూడా ఆయన రచనలు కొన్నయినా చదివే అవకాశం లభించటం, దాదాపు పదిహేనేళ్ళ క్రితం మా కలకత్తా ప్రయాణంలో "శాంతినికేతన్" ను చూడటం నా అదృష్టంగా భావిస్తాను నేను. ప్రయాణంలో కలకత్తాలో మాకు HMVవాళ్ళ రవీంద్రుని సొంత వాయిస్ తో రికార్డ్ చేయబడిన ఆయన కవితలూ,పాటలూ ఉన్న కేసెట్ ఒకటి దొరికింది. అందులో ని ఒక పాటనూ, ఒక రెసిటేషన్ నూ ఇక్కడ పెడుతున్నాను.


(young Tagore)


Tagore's recitations and one song in his own voice:ఆయన పర్సనాలిటీని, ఫోటోలను చూసి ఆయన గొంతుక చాలా గంభీరంగా ఉంటుండని అనుకునేదాన్ని... కానీ విన్నాకా ఓహో ఇదా ఆయన గొంతుక అనిపించింది. పైగా ఇది ఆయనకు కాస్త వయసు పైబడిన తరువాత చేసిన రికార్డింగా నాకు తోచింది. రవీంద్రుడు స్వయంగా రాసి, స్వరపరిచి "రవీంద్ర సంగీతం"గా ప్రఖ్యాత గాంచిన కొన్ని గీతాల గురించి నా తరువాతి టపాలో....

కొన్ని "శాంతినికేతన్" ఫొటోలు...

10 Responses
 1. చాలా మంచి పోస్టండి .రవీందృని గొంతు వినిపించినందుకు ధన్యవాదాలు.ఫొటోలు కూడా బాగున్నాయి


 2. Really am excited. Very nice post. I'l be back again


 3. Thanks for the post! శాంతినికేతన్.. పేరుకి తగ్గట్టే కనిపిస్తోంది. :-)


 4. తృష్ణ గారు ,
  ఫాలోయర్స్ గాడ్జెట్ నా బ్లాగ్లో రావటం లేదు ఏమైనా సలహా చెబుతారా .


 5. @రాధిక(నానీ) :అదీ టెంప్లేట్ ను బట్టి ఉండచ్చండీ...నాకు టెంప్లేట్ పెట్టినప్పుడు అది కూడా వచ్చేసిందండి. అందుకని తెలీదు మరి.blog related టెక్నికల్ వివరాల్లో నేనూ సున్నానేనండీ...:)


 6. SHANKY Says:

  ఇమేజ్ ని బట్టి వాయిస్ ని అంచనా వేయకూడదని నాకు శ్రీ శ్రీ గారి కవితలు ఆయన స్వంత గొంతులో విన్నప్పుడు అర్ధమయింది. ఇప్పుడు రవీంద్రుని గళం దాన్ని బలపరిచింది. అయినా వాళ్ళ గళాలలో గాంభీర్యం లేకపోతేనేం కలాలలో ఉందిగా.

  మీ అన్నయ్య గారిని అడిగానని చెప్పండి. త్వరలో "మా వూరు" గురించి ఒక పోస్ట్ రాస్తాను అది కూడా ఆయనకి తప్పక చూపించండి. ఎంతయినా మేము మేము మేము "కాకినాడ వాళ్ళం" కదా. :)


 7. భావన Says:

  చాలా బాగున్నాయి తృష్ణ పిక్చర్స్. ఆయన గొంతు కూడా వినిపించేవు. ధన్యవాదాలు. ఎంత అందం గా వుందో ఆయన కుటీరం. మొదటి ఫొటో లో పైన చెట్టూకు అంటుకున్న మేఘమొకటీ చూసేరా, ఎంత బాగుందో.


 8. R Satyakiran Says:

  This makes me recall my visit to Santiniketan. It was in the year 1993 during a Culcutta tour with my prents. Surprise! Its 17yrs now and still the memeories are fresh.


 9. భాను Says:

  తృష్ణ గారు ఈ బ్లాగ్ ఇప్పుడే చూశా. బాగుంది రవీంద్రుడి గొంతు వినే భాగ్యం కల్పించారు. సంతోషం మీ టేస్ట్ కి నెనర్లు


 10. రవీంద్రుని గొంతు వినిపించినందుకు చాలా చాలా thanks !